జీవీఎంసీలో అభివృద్ధి పనులకు ఆమోదం

జీవీఎంసీలో అభివృద్ధి పనులకు ఆమోదం

VSP: జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 172 అజెండా అంశాల్లో 160 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రూ.29.18 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. వివిధ కారణాలతో 12 అంశాలను వాయిదా వేసినట్లు మేయర్ తెలిపారు.