పేకాట రాయుళ్లపై దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట రాయుళ్లపై దాడి.. ఏడుగురు అరెస్ట్

GNTR: మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఆటోనగర్ 2వ లైన్‌లో డాబాపై పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, రూ.19,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.