గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MDK: హవేలి ఘనపూర్ మండలం రాజ్‌పేట్ తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదివారం  ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం, తండాలో జరిగిన తీజ్ పండుగలో పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.