జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి
AP: వైసీపీ హయాంలో బకాయిలుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, డైట్ బిల్లులు తామే చెల్లించామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గిరిజనుల మరణాలపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజనులను చులకన చేసి అబద్ధాలు మాట్లాడితే ఊరుకోమని మండిపడ్డారు. 'పరకామణి కేసులో చోరీ జరిగింది రూ.75 వేలే కదా అని జగన్ అంటున్నారు.. రూ.75 వేలు అయితే దొంగతనం చేయవచ్చా?' అని ప్రశ్నించారు.