భవానీపురం కూల్చివేతల్లో ట్విస్ట్
AP: విజయవాడలోని భవానీపురం కూల్చివేతల్లో ట్విస్ట్ నెలకొంది. జోజినగర్ కూల్చివేతలపై ఈనెల 31 వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆర్డర్ కాపీ అందేలోపే ఇళ్లను అధికారులు కూల్చేశారు. తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు.