నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి
ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం నందు మొంథా తుఫాన్ ప్రభావం వళ్ళ నష్టపోయిన ప్రజలకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రుకులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సహాయం క్రింద ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు, ఉల్లిపాయలు పంచారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు.