సైబర్‌ మోసం.. 21 మంది అరెస్ట్‌

సైబర్‌ మోసం.. 21 మంది అరెస్ట్‌

మైక్రోసాఫ్ట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ మోసాన్ని కర్ణాటక పోలీసులు వెలుగులోకి తెచ్చారు. సదరు సంస్థలో సోదాలు నిర్వహించి 21 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కలిసి వివిధ దేశాలకు చెందిన అనేక మందిని మోసగించినట్లు గుర్తించారు. బాధితుల ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి వారి సమాచారాన్ని సేకరించి..బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు చెప్పారు.