ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
BPT: మార్టూరు మండలం రాజుబంగారుపాలెం పంచాయితీ పరిధిలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక సదుపాయాల పరిస్థితి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సదుపాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు.