ఈనెల 24న బహిరంగ వేలం

ELR: నూజివీడు కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన ఏడు ఎకరాలలో విలువైన చెట్లకు ఈనెల 24వ తేదీ 10:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించబడుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. నూజివీడులో సబ్ కలెక్టర్ మంగళవారం మాట్లాడుతూ.. 82 కొబ్బరి చెట్లు, 5 వేప చెట్లు, 85 టేకు చెట్లు ఉన్నాయన్నారు.