ఘనంగా వరలక్ష్మి వ్రత మహోత్సవం

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి సన్నిధానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతమహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటగా అమ్మవారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వందలాదిమంది మహిళలచే అమ్మవారి నామస్మరణ పలికించారు.