మాకు కావాలి.. 'హైడ్రా'

మాకు కావాలి.. 'హైడ్రా'

గుంటూరు నగర ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రధాన సమస్య 'ముంపు'. కొద్దిపాటి వర్షం పడిన నగరం చెరువును తలపిస్తోంది. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ఆక్రమణ చెరలో వాగులు, ప్రణాళిక లేని నిర్మాణంతో నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ తరహాలో 'హైడ్రా' రావాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.