ఉప్పులూరు వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: ఉప్పులూరు వంతెనను MLA బోడే ప్రసాద్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెన పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో, జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడ్డర్లు ఏర్పాటు చేసి, పటిష్టమైన కాంక్రీట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులకు చెప్పారు.