నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో దరఖాస్తుల ఆహ్వానం

నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో దరఖాస్తుల ఆహ్వానం

ADB: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రేపాల కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు 9లో ప్రవేశానికి, పదో తరగతి చదివే విద్యార్థులు 11లో ప్రవేశానికి సెప్టెంబర్ 23లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.