విద్యుత్ తీగలు తొలగించాలని వినతి

విద్యుత్ తీగలు తొలగించాలని వినతి

NZB: డొంకేశ్వర్ మండలం అన్నారంలో తమ ఇళ్లపై వెళ్తున్న ప్రమాదంగా ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ADEని కలసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇళ్ల మీదుగా ఉన్న విద్యుత్‌ తీగలు కారణంగా గ్రామస్థులు ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. వాటిని మార్చాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.