మైలవరం టీడీపీ ఆఫీస్‌లో రేపు ప్రజాదర్బార్
NTR: మైలవరం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలను సేకరిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.