రైతు భరోసా.. రైతులకు అలర్ట్..!

రైతు భరోసా.. రైతులకు అలర్ట్..!

VKB: రైతు భరోసా పథకానికి కొత్త పట్టాదారులు దరఖాస్తు చేసుకోవాలని ఏవో కొమురయ్య తెలిపారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 25 వరకు మాత్రమే గడువు ఉందని, అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరితగతిన స్థానిక ఏవో కార్యాలయంలో సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు.