తాగునీరు సౌకర్యం కల్పించాలని కాలి బిందెలతో నిరసన
ASR: అనంతగిరి(మం) నాయుడువలసలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామ మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ తాగునీటి సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.