'తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దూసుకుపోతున్నారు. 5వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చాపల బాపురెడ్డికి మద్దతుగా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.