బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: సీఐ

TPT: నాయుడుపేటలోనీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల వద్ద బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ బాబి తెలిపారు. ఇందులో భాగంగా కళాశాల పనివేళల ముందు, అనంతరం కళాశాల వద్ద ఆకతాయిలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదని అన్నారు. అనంతరం విద్యార్థులకు కళాశాల వద్ద ఎదురయ్యే స్థితిగతులను తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు.