మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం

మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరం

JGL: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణలో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి హ్యాండ్ బాల్ క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు కోచ్ జైనపురం సాయికుమార్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని 14సం.లలోపు బాలబాలికలు వినియోగించుకోవాలన్నారు.