మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం: జూపల్లి

మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం: జూపల్లి

TG: అలవి వలలతో శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో చేపపిల్లలను వేటాడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల కృష్ణానదిలో చేపపిల్లలను వదిలిన జూపల్లి.. గంగమ్మ తల్లికి పూజలు చేశారు. చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందిస్తోందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అన్నారు.