అతి నిద్ర.. ఆరోగ్యానికి హానికరం..!
అతిగా నిద్రించడం ఆరోగ్యానికి హానికరమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని, అంతకు మించితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. అతి నిద్ర వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, డిప్రెషన్, తరచుగా తలనొప్పి, అకాల మరణం వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయని అవి వెల్లడిస్తున్నాయి.