జిల్లాలో క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తా: టీజీ

జిల్లాలో క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తా: టీజీ

KRNL: కర్నూల్ మౌర్య ఇన్లోని తన చాంబర్లో సోమవారం మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ బాక్సింగ్ శిక్షకులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బాక్సింగ్ క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాక్సింగ్ క్రీడకు ఎంతో ప్రాచుర్యం ఉందని, ప్రతిభ కలిగిన బాక్సింగ్ క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత శిక్షకులపై ఉందన్నారు.