తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు
VKB: పెద్దేముల్ మండలం బాయిమీది తండాలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై భార్య, కుమార్తెను వేధిస్తున్న తండ్రి రాథోడ్ లోక్యానాయక్‌ను కుమారుడు సునీల్ నాయక్ గొడ్డలితో నరికి చంపాడు. వేధింపుల గురించి తల్లి చెప్పడంతో ఆగ్రహించిన సునీల్, తండ్రితో గొడవపడి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.