VIDEO: ఉపాధ్యాయుల కొరతతో బోధనకు ఇబ్బందులు : MEO
అన్నమయ్య: చిట్వేలు మండలంలోని 58 పాఠశాలల్లో కేవలం 10 పాఠశాలల్లో మాత్రమే ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఆరు పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరని చిట్వేలు MEO-2 ఈశ్వరయ్య శుక్రవారం తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు మూత పడకుండా,ఉన్న పాఠశాలల నుంచి సిబ్బందిని పంపి తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కొరత వల్ల బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.