ప్రత్యేక అధికారులతో సమావేశమైన ఎంపీడీవో
ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో గ్రామపంచాయతీ ల పాలకమండలి పదవీకాలం పూర్తికాగా, ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారితో ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం సమావేశమయ్యారు. పంచాయతీల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు.