మదనపల్లెలో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో సోమవారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఐశ్వర్యతో పాటు ఆ చిత్రంలో ఆమె కొడుకుగా నటించిన బుల్లి రాజు (రేవంత్) కూడా హాజరు అయ్యారు. కాగా, వారిని చూసేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.