బత్తలపల్లి మండలంలో భారీగా పంట నష్టం
సత్యసాయి: బత్తలపల్లి మండలంలో కురిసిన అకాల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కట్టకిందపల్లి, ముద్దనపల్లి గ్రామాల్లో చేతికొచ్చే అరటి, మొక్కజొన్న, మునగ పంటలు నేలకొరిగాయి. మండల టీడీపీ కన్వీనర్ నారాయణ రెడ్డి అధికారులతో కలిసి దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించి, రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఎమ్మార్వోను కోరారు.