మడకశిరలో మూడు మద్యం దుకాణాలకు అనుమతి

మడకశిరలో మూడు మద్యం దుకాణాలకు అనుమతి

సత్యసాయి: మడకశిర పట్టణానికి మూడు బార్లను ప్రభుత్వం కేటాయించినట్లు ఎక్సైజ్ సీఐ మురళీ కిషోర్ తెలిపారు. ధర్మవరం కార్యాలయంలో ఆశావాహులకు అవగాహన కల్పిస్తూ, ఒక్కో బార్కు రూ.35 లక్షల చలానా, రూ.5.10 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు విధించనున్నట్లు పేర్కొన్నారు. టెండర్లకు ఈ నెల 26 చివరి తేదీగా నిర్ణయించగా, ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు బార్లు నడపవచ్చని వెల్లడించారు.