కార్తీక మాసం.. జిల్లా నుంచి శివాలయాలకు ప్రత్యేక బస్సులు
VKB: కార్తీక మాసంలో ప్రయాణికుల సౌకర్యార్థం VKB జిల్లా నుంచి శివాలయాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. కార్తీక మాసంలో శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈక్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడిపించాలని నిర్ణయించారు. శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం ప్రాంతాలకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.