ఎవరు భయాందోళన చెందవద్దు: కలెక్టర్

BPT: జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మురళి పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, ఫీవర్ ఉన్నవారికి వెంటనే రాపిడ్ టెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెళ్లడించారు.