'పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకం'

'పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకం'

KKD: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డ్స్ పోలీసు శాఖకు వెన్నెముకలా నిలచి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నారన్నారు.