'KTPS ఆధునికరణకు చొరవ చూపాలి'

BDK: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ( కేటీపీఎస్ ) ఆధునికీకరణ, పాత ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం.. 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు.