యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా..!
ఏలూరులో ఇవాళ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రుద్రాక్షి రవి కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ PRCను ప్రకటించాలని జిల్లా జె.ఏ.సి ఛైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57 మెమోని అమలు చేసి 2004కి ముందు నియామకాలు పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలన్నారు.