ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలి: సీపీఎం
AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలని CPM రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 'మావోయిస్టులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నా పోలీసులు అన్యాయంగా ఎన్‌కౌంటర్ చేశారని తెలుస్తోంది. పోలీసులు గిరిజనుల వేధింపులు, నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలి' అని పేర్కొన్నారు.