జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న ఎంపీ

ASR: ఆదివారం తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నట్లు అరకు ఎంపీ తనూజా రాణి స్థానిక మీడియాకు తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. చట్ట సభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడంలో మహిళల పాత్రపై చర్చించామన్నారు.