అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
GDWL: కేటిదొడ్డి మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టరును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. SI శ్రీనివాసులు వివరాలు.. కర్ణాటక సరిహద్దుల నుంచి కొండాపురం గ్రామానికి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు.