నేరాల నివారణపై అవగాహన సదస్సు

నేరాల నివారణపై అవగాహన సదస్సు

SRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై ఇవాళ సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.