నంద్యాల GDCలో ఉచిత శిక్షణ: ప్రిన్సిపల్
NDL: నంద్యాలలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో APSSDC ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డా.శశికళ తెలిపారు. సెక్యూరిటీ అనలిస్ట్, వెబ్ డెవలపర్ కోర్సులలో ప్రవేశాలు ఉంటాయన్నారు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్యూటర్ కోర్సులు చదివిన వారు అర్హులు. ఆసక్తి గల వారు కళాశాలలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.