పెద్ద అంబర్‌పేట్‌లో డ్రైనేజ్ జామ్‌తో ప్రజలకు నరకయాతన

RR: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో పసుమాముల గ్రామం పోచమ్మ కాలనీలో, 3వ వార్డు రోడ్ నెంబర్ 3లో చెత్త, మురుగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీ పైప్ లైన్‌లో చెత్త జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు.