'అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించాలి'
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.