19 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

19 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96వ బ్యాచ్‌కు చెందిన 19 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.