వైసీపీకి మద్దతుగా నిలవాలి: బుట్టా రేణుక

కర్నూల్: ఎమ్మిగనూరు పట్టణంలోని 20వ వార్డులో సోమవారం వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. జగన్ ప్రభుత్వంలో 99శాతం హామీలు అమలయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రమీల, వైసీపీ నాయకులు బుట్టా రంగయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.