అదుపుతప్పిన కారు.. తప్పిన ప్రమాదం

GDWL: గద్వాల మండలం వెంకంపేట గ్రామ శివారులో బుధవారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. నిర్లక్ష్యంగా కారు నడపడంతో అది రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.