బహిరంగ సభను విజయవంతం చేయాలి: దుర్గు పటేల్
ADB: ఈ నెల 23వ తేదీన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉట్నూరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ సార్మేడి మెస్రం దుర్గు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కొమురంభీం చౌక్ ఎదుట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.