బాధితులకు త్వరగా న్యాయం అందించాలి: ఎస్పీ

బాధితులకు త్వరగా న్యాయం అందించాలి: ఎస్పీ

సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను SP సతీష్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన 72 అర్జీలను స్వీకరించారు. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.