VIDEO: 'భక్తులకు పెద్దపీటతో చందనోత్సవం విజయవంతం'
VSP: సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో అప్పన్న స్వామి చందనోత్సవాన్ని నిర్వహించారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ప్రభుత్వ విజయమన్నారు.