'వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'
ASR: సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్రామ వాలంటీర్లకు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట వాలంటీర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంగళవారం సందర్శించారు. వాలంటీర్లపై వైసీపీ రాజకీయ ముద్ర వేయడం సరికాదని, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.