కందుకూరులో ప్రకృతి సేద్యంపై శిక్షణా కార్యక్రమం
NLR: కందుకూరు మండలంలో వ్యవసాయ సహాయకులు, ప్రకృతి సేద్య సిబ్బందికి MAO అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఒగూరు గ్రామంలో పంటలను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ జీవామృతాల తయారీపై ప్రాక్టికల్‌గా చూపించారు.