'ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి'
MBNR: జడ్చర్ల పరిధిలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని MSF నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్‌కు దానం హరిబాబు, బి. వినోద్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేపడుతామని హెచ్చరించారు.